దారుణం.. మహిళను చంపేసి ముళ్లపొదల్లో పడేశారు!

113చూసినవారు
దారుణం.. మహిళను చంపేసి ముళ్లపొదల్లో పడేశారు!
AP: ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో పారిశ్రామికవాడలో దారుణ ఘటన జరిగింది. శ్రామికనగర్ కు చెందిన కందిమళ్ల మణి (40) హత్యకు గురైంది. జ్యోతి హోటల్ సమీపంలో దుండగలు ఆమెను చంపేసి ముళ్లపొదల్లో పడేశారు. అయితే శనివారం ఆమె మృతదేహం లభ్యమైంది. ఉదయం పనికి వెళ్లిన మణి మధ్యాహ్నం హత్యకు గురైంది. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె కంపెనీలో పనిచేస్తుంది. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.