దారుణం.. పిల్లలు పుట్టడం లేదని కోడల్ని చంపేశారు

37242చూసినవారు
దారుణం.. పిల్లలు పుట్టడం లేదని కోడల్ని చంపేశారు
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య చేశారు. కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో 2005లో సరళకు వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. సరళ గర్భం దాల్చలేదని భర్త, అత్తమామలు ఆమెను నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో సరళను హత్య చేసి, ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కోడలు చనిపోయిందంటూ నాటకమాడి.. అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.
Job Suitcase

Jobs near you