దారుణం.. విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

36758చూసినవారు
దారుణం.. విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
AP: తిరుపతిలో దారుణం జరిగింది. ఓ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ గర్భవతి చేశాడు. విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు రికార్డు చేసి లైంగికంగా వేధించేవాడు. బాధితురాలు యూనివర్సిటీ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేయడంతో.. లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యూనివర్సిటీ స్టాఫ్ వెళ్లగా.. ఫిర్యాదు తీసుకోలేదని సమాచారం. విద్యార్థిని యూనివర్సిటీ నుంచి ఒడిశాకు వెళ్లిపోయినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్