AP: విశాఖపట్నంలోని వేపగుంట అప్పన్నపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన కోడలు, ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. పోలీసుల విచారణలో కోడలే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 'దొంగ పోలీసు ఆట' అని పిల్లలకు చెప్పి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు.. అత్త చేతులు, కాళ్లు కట్టేసి నిప్పంటించినట్లు కోడలు పోలీసుల విచారణలో అంగీకరించింది.