దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త

57937చూసినవారు
దారుణం.. భార్య గొంతు కోసి చంపిన భర్త
AP: నంద్యాలలో మంగళవారం మహిళ దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భర్తే భార్యను గొంతుకోసి చంపాడు. ఎన్జీవో కాలనీలో పౌరోహిత్యం చేసిన జీవనం సాగిస్తున్న భర్త సాయినాథశర్మ భార్య శిరీషను గొంతు కోసి హత్య చేశాడు. భార్య శిరీష పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో ఇద్దరూ పరస్పరం గొడవపడి, క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. అనంతరం టూ టౌన్ పీఎస్‌కు వెళ్లి లొంగిపోయాడని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.