బెంగళూరులో స్కానింగ్ కోసం వచ్చిన మహిళ పట్ల ఓ రేడియాలజిస్ట్ అసభ్యంగా ప్రవర్తించాడు. జయకుమార్ అనే వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్టులను తాకాడు. ఆ మహిళ ప్రశ్నించగా చంపేస్తానని బెదిరించడంతో.. ఆమె ఫోన్‌లో అతనికి తెలియకుండా రికార్డు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అతడిని అరెస్ట్ చేయకుండా ఫోన్ కాల్ చేసి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. ఇది వైరలవ్వడంతో పోలీసులపై నెటిజన్లు మండిపడుతున్నారు.