TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో మంగళవారం ఒక దారుణం చోటుచేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు వడ్డే బాలయ్యను, అతని కన్న కొడుకే ముఖానికి గుడ్డ కట్టుకొని బైక్‌పై తీసుకువచ్చి, జడ్చర్ల 100 పడకల ఆసుపత్రి సమీపంలోని కంప పొదల్లోని గుంతలో నెట్టేసి వెళ్ళాడు. స్థానికులు గమనించి, వృద్ధుడిని బయటకు తీసి, ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితుడైన కొడుకు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.