TG: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను పక్కింట్లో ఉండే వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక ఏడుస్తూ కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.