హైదరాబాద్ అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ ప్రకాష్ అనే యువకుడి కుటుంబంపై యువతి బాబాయ్ దాడికి పాల్పడ్డాడు. సదరు యువకుడి ఇంటికి వెళ్లి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఇంట్లో ఉన్న మహిళతో పాటు మరో చిన్నారికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.