మరణానంతరం తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారిని భౌతికంగా భద్రపరచడానికి క్రయో ప్రిజర్వేషన్ అనే వినూత్న విధానం అందుబాటులోకి వచ్చింది. మృతదేహాలను -196 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ నైట్రోజన్‌లో నిల్వ చేస్తారు. భవిష్యత్ లో మరణించిన వ్యక్తిని బతికించే సాంకేతికత అందుబాటులోకి వస్తే, వారి శరీరాన్ని ఉపయోగించుకోవడమే దీని లక్ష్యం. చైనాలో ఓ వ్యక్తి మరణించిన తన భార్య డెడ్ బాడీని క్రయో ప్రిజర్వేషన్ చేయించి,దాదాపు సంవత్సరం పాటు భద్రపరిచాడు.