పాండిచ్చేరి ప్రీమియర్ లీగ్‌లో బుధవారం సీఎస్‌కే ఆటగాడు అమన్ ఖాన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం పూర్తి చేసి, మొత్తం 129 పరుగులు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో
టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 32 బంతుల్లో శతకం సాధించిన హైదరాబాద్‌కు చెందిన అమన్ రావు తొలి స్థానంలో కొనసాగుతుండగా, 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ మూడో స్థానానికి పడిపోయాడు.