CT ఫైనల్.. భారత్ లక్ష్యం 252 పరుగులు

5553చూసినవారు
CT ఫైనల్.. భారత్ లక్ష్యం 252 పరుగులు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ (63), బ్రేస్‌వెల్ 53* అర్థశతకాలతో రాణించగా.. రచిన్ 37, ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వరుణ్, కుల్దీప్, చెరో రెండు వికెట్లు తీయగా జడేజా, షమీ తలా ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్