
తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులపాటు భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 23 రాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 50-70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ సహా 28 జిల్లాలకు అధికారులు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు.




