
ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కల్పించాలా ? - సుప్రీంకోర్టు
దేశంలోకి అక్రమంగా వచ్చిన వారికి ఆధార్ కార్డులు జారీ చేస్తున్నారని అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కల్పించాలా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆధార్ కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమేనని, పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పొరుగు దేశం నుంచి వచ్చిన కూలీకి రేషన్ కార్డు కోసం ఆధార్ ఇస్తే, అతడిని ఓటరుగా చేయాలా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.




