
డ్రగ్స్ పెడ్లర్‌ను పట్టించిన ర్యాపిడో రైడర్ (వీడియో)
హైదరాబాద్ శివారు దుండిగల్‌లో గంజాయి రవాణా చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్‌ను ర్యాపిడో రైడర్ పట్టుకున్నాడు. మే 31న బీహార్‌కు చెందిన రూపేశ్ కుమార్ మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా పార్సిల్ బుక్ చేశాడు. పార్సిల్‌పై అనుమానం వచ్చిన ర్యాపిడో డ్రైవర్ ఆదర్శన్ దుండిగల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు పార్సిల్‌ను పరిశీలించగా గంజాయి ఉన్నట్లు గుర్తించి, రూపేశ్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై విచారణ చేస్తున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి పోలీసులకు సహకరించిన ర్యాపిడో రైడర్ ఆదర్శన్‌ను డీసీపీ కోటిరెడ్డి అభినందించారు.




