కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరివేపాకును అధికంగా తీసుకునే ముందు జాగ్రత్త వహించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, తక్కువ రక్తపోటు, మధుమేహం, రక్తం పలుచన చేసే మందులు వాడేవారు, గర్భిణీలు వైద్యుల సలహా తీసుకోవాలి. సాధారణ వంటల్లో వాడే కరివేపాకు, రసం లేదా పొడి రూపంలో అధికంగా తీసుకోవడం వేర్వేరు అని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వైద్యుల సూచన లేకుండా అధిక మోతాదులో తీసుకోకూడదని పేర్కొన్నారు.