బిల్లులో 'ఆవు పన్ను' చూసి కస్టమర్ షాక్!

9291చూసినవారు
బిల్లులో 'ఆవు పన్ను' చూసి కస్టమర్ షాక్!
రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఇటీవల పార్క్ ప్లాజాలోని జియోఫ్రీ బార్‌కు వెళ్ళాడు. ఆరు బీర్లు, మొక్కజొన్న వడలకు రూ. 2,650 బిల్లు రాగా, జీఎస్టీ, వ్యాట్‌తో పాటు 20 శాతం 'ఆవు పన్ను'తో కలిపి మొత్తం రూ. 3,262 బిల్లు వచ్చింది. మద్యంపై ఆవు పన్ను విధించడాన్ని చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. బార్ యాజమాన్యం 2018లో రాజస్థాన్ ప్రభుత్వం గోవుల రక్షణ కోసం ప్రవేశపెట్టిన పన్ను అని, అప్పటి నుంచి మద్యం అమ్మకాలపై వసూలు చేస్తున్నామని, ఆ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తామని వివరణ ఇచ్చింది.