ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ఇండియా పోస్ట్ పేరుతో వస్తున్న 'అడ్రస్ అప్‌డేట్' మెసేజ్‌లు పూర్తిగా ఫేక్ అని ప్రభుత్వ సంస్థ PIB స్పష్టం చేసింది. పార్సల్ అడ్రస్ సరిగా లేదని, 48 గంటల్లో అప్‌డేట్ చేయకపోతే వెనక్కి పంపేస్తామని భయపెట్టి, లింక్‌పై క్లిక్ చేయించి డబ్బులు కొట్టేయడమే మోసగాళ్ల ప్లాన్. ఈ మెసేజ్‌లలోని లింక్‌లను క్లిక్ చేస్తే ఫోన్ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఉందని PIB హెచ్చరించింది. ఇలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే డిలీట్ చేయాలని సూచించింది.