ముద్రా లోన్ పేరుతో వాట్సప్‌లో సైబర్ మోసాలు.. కేంద్రం హెచ్చరిక!

26చూసినవారు
ముద్రా లోన్ పేరుతో వాట్సప్‌లో సైబర్ మోసాలు.. కేంద్రం హెచ్చరిక!
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముద్రా లోన్ మంజూరు అయినట్లు వాట్సాప్‌లో వచ్చే సందేశాలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ముద్రా నేరుగా రుణాలు ఇవ్వదని, ఏజెంట్లు కూడా ఉండరని కేంద్రం స్పష్టం చేసింది. రుణం కోసం సమీప బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలను సంప్రదించాలని లేదా Udyamimitra పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అనుమానాస్పద సందేశాలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది.

సంబంధిత పోస్ట్