TG: సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మహేందర్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. ఓ కేసులో కుటుంబసభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు రూ.9 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో రూ.5 లక్షలు తీసుకున్న మహేందర్, మిగిలిన నగదు కోసం డిమాండ్ చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఇతర స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.