వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!

11చూసినవారు
వినాయకుని రూపంలో సైబర్ సెక్యూరిటీ పాఠాలు!
ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని.. తెలంగాణ పోలీసులు సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. 'సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి' అనే నినాదంతో గణేశుని రూపాన్ని పోలిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా వినాయకుడి పెద్ద చెవులు శ్రద్ధగా వినాలని, చిన్న కళ్లు నిశితంగా గమనించాలని, చేతిలోని కలం సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్