సైబర్ నేరగాళ్ల ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌సీసీ 10వేల మంది క్యాడెట్లతో 'సైబర్ వారియర్స్'ను ఏర్పాటు చేయనుంది. వీరిని నేషనల్ డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర స్పందన కోసం లక్ష మంది క్యాడెట్లకు 'యువ ఆపద మిత్ర'లుగా శిక్షణ ఇస్తారు. దేశవ్యాప్తంగా హబ్స్‌లో ఎంపిక చేసిన క్యాడెట్లకు డ్రోన్, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఎన్‌సీసీ క్యాడెట్లు తొలిసారి కత్తితో మార్చ్ చేయనున్నారు.