
అనుమానంతో భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త
తమిళనాడులోని తిరువణ్ణమలై జిల్లా, కరుంగలికుప్పంలో కరుణాకరణ్ అనే వ్యక్తి తన భార్య కళయరాసిని అనుమానంతో కరెంట్ షాక్ ఇచ్చి దారుణంగా హత్య చేశాడు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఈ అనుమానంతోనే పథకం ప్రకారం భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. అనారోగ్యంతో చనిపోయిందని అత్తమామలను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణలో భర్త నేరం ఒప్పుకున్నాడు.




