
అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు (వీడియో)
AP: నంద్యాల జిల్లా సంజామలలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి బస్సు కాలువలో పడిపోవడంతో పాటు పక్కనే ఉన్న ప్రహరీ గోడను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.




