TG: మురసు తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారి చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులను ఐఎండీ అప్రమత్తం చేసింది. ఇప్పటికే అశ్వారావుపేటలో అత్యధికంగా 27.6 సెం.మీల వర్షపాతం, మల్కారంలో 18.8 సెం.మీ, అంకంపాలెంలో 17.5 సెం.మీల వర్షపాతం నమోదైందని పేర్కొంది.