బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.