AP: రాష్ట్రాన్ని మొంథా తుఫాన్ ముంచెత్తింది. "ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్పా బయటకు రాకండి" అని అధికారులు తెగ చెప్తున్నారు. రాష్ట్రంలో కూడా తుఫాన్ కారణంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అసలు ఈ తుఫాన్‌కు ఆ పేరు ఎవరు పెట్టారు..? మొంథా అంటే అర్థం ఏంటని చాలా మందికి డౌట్. ‘మొంథా’ అనే పేరును థాయ్‌లాండ్ సూచించింది. థాయ్ భాషలో ‘మొంథా’ అంటే “సువాసన కలిగిన పుష్పం” అని అర్థం.