మొంథా తుఫాన్.. తెలంగాణకు రెడ్ అలర్ట్

20262చూసినవారు
మొంథా తుఫాన్.. తెలంగాణకు రెడ్ అలర్ట్
TG: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఈ రోజు (మంగళవారం) అర్ధరాత్రి పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావం ఉండనుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్