
స్పెయిన్ రైలు ప్రమాదం.. రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె రాజీనామా
స్పెయిన్లోని మాడ్రిడ్-సెవిల్లే మార్గంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటె రాజీనామా చేశారు. అక్టోబర్ 28న సిగ్నలింగ్ వ్యవస్థ విఫలమై, కంట్రోల్ రూమ్ నుంచి అందిన తప్పుడు సంకేతాల వల్ల జరిగిన ఈ ప్రమాదంలో 69 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఏడాదిలో ఇది రెండో భారీ ప్రమాదం కావడంతో తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు.




