బంగాళాఖాతంపై ఆవర్తనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

128చూసినవారు
బంగాళాఖాతంపై ఆవర్తనం.. ఈ జిల్లాల్లో వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం, అక్కడక్కడ చిరు జల్లులు పడొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్