కశ్మీర్‌లో పాక్షికంగా గడ్డకట్టిన దాల్ సరస్సు

6చూసినవారు
కశ్మీర్‌లో పాక్షికంగా గడ్డకట్టిన దాల్ సరస్సు
ఉత్తరాది రాష్ట్రాలను చలి చంపేస్తోంది. ముఖ్యంగా హిమాలయాల సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోయాయి. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కశ్మీర్‌ లోయలోని సరస్సులు, చెరువులు, కుంటలలో ఉన్న నీరు గడ్డ కట్టుకుపోయింది. కశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సులో కూడా చలి తీవ్రతకు నీరు పాక్షికంగా గడ్డకట్టింది. సరస్సు పైభాగంలో చాలావరకు నీరు గడ్డకట్టి మంచు పొర ఏర్పడింది. దాల్ సరస్సుపై మంచుపొర కప్పిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్