దళిత యువకుడితో బూట్లు నాకించి చేయి విరగ్గొట్టారు

27750చూసినవారు
దళిత యువకుడితో బూట్లు నాకించి చేయి విరగ్గొట్టారు
యూపీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 5న దళిత యువకుడు ఉమేష్ బాబు వర్మపై అగ్రవర్ణాలకు చెందిన యువకులు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను చించివేయడంపై పాత గొడవను మనసులో పెట్టుకుని అతనితో బూట్లు నాకించి, చేయి విరగ్గొట్టారు. 12 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుడు జిల్లా ఎస్పీ డాక్టర్ దీక్షా శర్మను ఆశ్రయించాడు. ఆమె ఆదేశాలతో నిందితులపై కేసు నమోదైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్