AP: విశాఖలో బుధవారం జరిగిన ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు గాయపడ్డారు. ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బుల్టెన్ ప్రకారం, ఎడమ తుంటి డిస్క్ ను తిరిగి అడ్జస్ట్ చేశారు. హిప్ జాయింట్ దెబ్బతినడంతో పాటు, మోకాలికి తుంటికి మధ్య ఫ్యాక్చర్ అయింది. తలకు కూడా గాయాలయ్యాయి. డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పండు తిరిగి డాన్స్ చేయడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు.