TG: హైదరాబాద్‌లోని బాచుపల్లి ఫ్లైఓవర్‌పై బుధవారం అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ రీల్స్ చిత్రీకరిస్తున్నారు. పక్కనే వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, రాత్రి వేళ తక్కువ విజిబిలిటీలో రోడ్డుపై రీల్స్ చేస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, పోలీసులు తక్షణమే స్పందించి ఫ్లైఓవర్‌పై నైట్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.