అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే విషాదం

200చూసినవారు
అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే విషాదం
AP: అమ్మవారి ఊరేగింపులో భార్యతో కలిసి నృత్యం చేస్తూ ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. పెదగాడి గ్రామానికి చెందిన అప్పికొండ త్రినాథ్ (56) డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. అమ్మవారి నిమజ్జనం సందర్భంగా భార్య లక్ష్మీతో కలిసి ఊరేగింపులో నృత్యం చేశాడు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్