ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి రాత్రి ఘనంగా పెళ్లి చేసుకుని ఉదయం ప్రియుడితో పరారైంది. బరాత్‌లో కూడా హుషార్‌గా వరుడితో కలిసి డ్యాన్స్‌కు చేసింది. అయితే మరుసటి రోజు ఉదయం పెళ్లికూతురు కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనతో జిల్లాలో కలకలం రేగింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.