
ఏఐతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలకు ముప్పు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో 2030 నాటికి యూరోప్‌లోని బ్యాంకుల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో 35 ప్రధాన బ్యాంకులు సిబ్బందిని 10 శాతం వరకు తగ్గించవచ్చని అంచనా. AI వినియోగం, భౌతిక శాఖల తగ్గింపుతో బ్యాక్ ఆఫీస్, రిస్క్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.




