హర్యానాలోని పంచకుల జిల్లాలో, చండీమందిర్ టోల్ ప్లాజా వద్ద ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అతివేగంగా బైక్ నడుపుతూ, దానిపై నిల్చొని ప్రమాదకర స్టంట్లు చేశాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన యువకుడి వీడియో పోలీసుల దృష్టికి రావడంతో, స్టంట్ చేసిన యువకుడితో పాటు వీడియో రికార్డ్ చేస్తూ మరో బైక్ నడిపిన వారిపై మొత్తం రూ.45 వేల జరిమానా విధించారు.