ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


వాట్సాప్‌నకు గట్టి పోటీగా అరట్టై యాప్, టీవీలోనూ చాటింగ్!
Oct 01, 2025, 07:10 IST/

వాట్సాప్‌నకు గట్టి పోటీగా అరట్టై యాప్, టీవీలోనూ చాటింగ్!

Oct 01, 2025, 07:10 IST
కొద్ది రోజుల్లోనే ప్రజాదరణ పొందిన అరట్టై యాప్, ప్లే స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్‌లతో మెసేజింగ్ యాప్‌గా మారింది. 'మేడ్-ఇన్-ఇండియా' వాట్సాప్‌గా పిలువబడుతున్న ఈ యాప్, ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ వంటి కొత్త ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్‌లో లేని ఈ ఫీచర్‌తో, యూజర్లు ఆండ్రాయిడ్ టీవీలో తమ అరట్టై ఖాతాలోకి లాగిన్ అయి పెద్ద స్క్రీన్‌పై చాట్ చేయవచ్చు. అరట్టై కేవలం ఆండ్రాయిడ్‌కే కాకుండా విండోస్, మాక్, లైనక్స్‌తో సహా ఐదు సాఫ్ట్‌వేర్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇండియన్ క్లౌడ్ ప్లాట్‌ఫాం జోహో తీసుకొచ్చిన ఈ యాప్, కేవలం మూడు రోజుల్లోనే 3.5 లక్షల సైన్అప్‌లతో దూసుకెళ్తోంది.