ఈ నెల 24 వరకు తిరుపతిలో దర్శనం టోకెన్ల రద్దు

9645చూసినవారు
ఈ నెల 24 వరకు తిరుపతిలో దర్శనం టోకెన్ల రద్దు
AP: తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ల జారీని మరో నాలుగు రోజులు నిలిపివేస్తున్నట్లు TTD అధికారులు తెలిపారు. తొలుత ఈనెల 14 నుంచి 20 వరకు టోకెన్లు నిలిపివేయగా.. తాజాగా 24 వరకు పొడిగించారు. 25న దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న జారీ చేయనున్నారు. కాగా, 21న టోకెన్ల రద్దుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో పలువురు భక్తులు కేంద్రాలకు చేరుకుని నిరాశకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్