AP: చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దర్శనాలు పూర్తి చేస్తామని, 30 వేల నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఇవాళ అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామనని వెల్లడించారు.