చాలా మంది ఉదయం కాఫీ, టీతో రోజు ప్రారంభిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తినడం వల్ల సహజంగా శక్తి పెరుగుతుంది. ఖర్జూరాలలో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే, అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సంకలితం చేయబడింది. ఏదైనా ఆహార మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.