
కరాచీలో ఉద్రిక్తత.. ఆరుగురు మృతి! (వీడియో)
ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ మృతితో పాకిస్థాన్లోని కరాచీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూఎస్ కాన్సులేట్ వద్ద చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి దిగి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను అణిచివేసేందుకు యత్నిస్తున్నారు.




