TG: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్కబాయి దంపతులకు ప్రతాప్ సింగ్, కుబేర్సింగ్, ఆనార్సింగ్, రామ్ లఖన్ సింగ్ నలుగురు కుమారులు. ప్రస్తుత ఎన్నికల్లో లఖన్ సింగ్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. అతడికి పోటీగా సోదరులు కుబేర్సింగ్, అనార్సింగ్ లు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని ఆసక్తిగా మారింది.