బెంగళూరులోని సుబ్రహ్మణ్యపుర పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. యువకులతో తిరగొద్దని మందలించిన తల్లిని ఓ యువతి హతమార్చింది. ఉత్తరహళ్లి నివాసి 34 ఏళ్ల నేత్రావతి అనుమానస్పద మృతి పై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నేత్రావతి తన 15 ఏళ్ల కుమార్తె, 17 ఏళ్ల లోపు వయస్సున్న స్నేహితులతో సంబంధాన్ని కలిగి ఉండటాన్ని వ్యతిరేకించింది. దీంతో కూతురు తల్లిపై కోపం పెంచుకుంది. అక్టోబరు 25న నలుగురు స్నేహితులతో కలిసి నేత్రావతిని హత్య చేశారని పోలీసులు తెలిపారు.