యూపీలోని ముజఫ్ఫర్ నగర్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం పోరాడగా.. కోర్టులో నిందితుడు దోషిగా తేలాడు. అయితే శిక్ష పడుతుందనే భయంతో అతడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ బాధితురాలు ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లి సదరు వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసింది. ఎందుకు పెళ్లి చేసుకోవు అంటూ ఆ యువతిని దారుణంగా కొట్టింది.