కూతురు మృతి.. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం

55627చూసినవారు
కూతురు మృతి.. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం
AP: కర్నూలు బస్సు ప్రమాదంలో బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గన్నమనేని ధాత్రి (27) మృతి చెందిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా.. ఏకైక కుమార్తె కూడా శాశ్వతంగా దూరమవ్వడంతో తల్లి వాణి ఆవేదన వర్ణనాతీతం. ధాత్రికి వివాహం చేయడానికి సంబంధాల కోసం చూస్తున్నారు. ఈ  క్రమంలో బస్సు ప్రమాదం ఆ తల్లి ఆశలను సమాధి చేసింది. గుర్తుపట్టలేని విధంగా కుమార్తె మృతదేహం కాలిపోవడంతో వాణి బోరున విలపించారు.

సంబంధిత పోస్ట్