ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులు (వీడియో)

8చూసినవారు
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురికి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన బిహార్‌లోని పూర్నియా జిల్లా చపాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. రియా గోస్వామి (18), మిలన్ కుమార్ (24) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మిలన్ దళిత వర్గానికి చెందిన యువకుడు కావడంతో.. వీరి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో సెప్టెంబర్ 8న రియా, మిలన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. దాంతో రియా చనిపోయిందని తల్లిదండ్రులు అంత్యక్రియలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్