ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్, ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన 'డిసి' చిత్రానికి పనిచేసిన దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్, దర్శకనటుడు
లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ లకు సరికొత్త బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందజేశారు. చిత్రం భారీ విజయం సాధించడంలో వీరి కృషిని అభినందిస్తూ కళానిధి మారన్ ఈ కానుకలను అందించారు. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తమ అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించింది.