TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో డీసీసీలదే కీలక పాత్ర అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం పర్యటనల దృష్ట్యా డీసీసీలు అందరూ అలర్ట్‌గా ఉండాలన్నారు. తాను జిల్లా అధ్యక్షుడిని కాలేకపోయానని.. కానీ టీపీసీసీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లభించిదని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ పరిశీలకుల చేత డీసీసీల నియామకం జరిగిందని చెప్పారు. తప్పకుండా పనికి తగిన గుర్తింపు దక్కుతుందన్నారు.